logoయూపీ మహాకూటమిని మద్యంతో పోల్చిన మోదీ

...

ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మీరట్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎస్పీ, ఆర్ఎల్డీ, బీఎస్సీ కూటమిని ఆయన తప్పుపట్టారు. యూపీ మహాకూటమి.. షరాబ్‌(మద్యం)తో సమానం అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలోని సా, ఆర్ఎల్డీ పార్టీలోని రా, బీఎస్పీ పార్టీలో బా కలిపితే షరాబ్‌(మద్యం) అవుతుందని మోదీ విమర్శలు చేశారు. యూపీ ఆరోగ్యం కోసం, భారత భవిష్యత్తు కోసం మద్యం నుంచి దూరంగా ఉండాలని మోదీ అన్నారు. మహాకూటమి మిమ్ముల్ని నాశనం చేస్తుందన్నారు. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని మోదీ మరీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించింది. మోదీ తన మాటలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ చేసింది .