logo



పారికర్ పార్థివదేహానికి నివాళి అర్పించిన మోదీ..!

...

గోవా సీఎం మనోహర్ పారికార్ పార్థివదేహానికి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కాసేపటి క్రితం పనాజీ చేరుకున్న మోదీ కలా అకాడమీలో ఉంచిన పారికార్ భౌతికకాయాన్ని సందర్శించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్,కేంద్ర మంత్రి గడ్కరి కూడా పారికార్ భౌతిక దేహానికి నివాళి అర్పించారు. పారికార్ కుటుంబసభ్యులతో మాట్లాడినా మోదీ వారిని ఓదార్చారు. 63 ఏళ్ల పారికర్ గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు చికిత్స పొందారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన మృతిచెందారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.