logoనేడు మూడు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం ..!

...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పాణ్యంలోని ఓర్వకల్లులో జగన్ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాయదుర్గంలో ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటిలో జగన్ ఎన్నికల సభ నిర్వహించనున్నారు.