logo



వైఎస్‌ఆర్‌ కు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

...

వైఎస్‌ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో ఈ రోజు (శనివారం) పూర్తయిన వెంటనే వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ కు చేరుకొని, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద జగన్‌ నివాళులర్పించారు. వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుండి హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు ఎంఎల్‌సి జంగా కృష్ణమూర్తి, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎంఎల్‌ఎ లు అంజాద్‌ భాష, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, రఘురామి రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.