logo



నేటి నుండి టిడిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం

...

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా ఆయన తిరుపతి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. అంతకు ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి ఉదయం 11 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తల సమావేశాలకు హాజరవుతారు. సోమవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ సీఎం పర్యటిస్తారు. అన్ని జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలను కలిశాక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళతారు .