logo



' ఉగాది' కానుకగా 'మహర్షి' నుంచి టీజర్ ..!

...

మహేష్ కథానాయకుడిగా ''మహర్షి'' సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రిసెంట్ గా ఈ సీనిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రికరించడానికి ప్లాన్ చేశారు. ఇక ''ఉగాది'' కానుకగా ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు అశ్వనీదత్ పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మే 9వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేష్ బాబు కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.