logo



ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరం ..!

...

 

 

 

 

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 17వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది. లోక్ సభ్ ఎన్నికలకు ప్రియాంక దూరంగా ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఎన్నికల్లో కేవలం ఆమె ప్రచారంపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థులు గెలుపునకు ప్రియాంక కీలకంగా పని చేయనున్నారు. సోనియా, రాహుల్ గెలుపు కోసం దశాబ్ద కాలం నుంచి ప్రియాంక కృషి చేస్తున్న విషయం విదితమే. అమేథి నుంచి సోనియా, రాయ్ బరేలి నుంచి రాహుల్ బరిలో ఉన్నారు.