logo



విశాఖ ఉత్తరం నుంచి నారా లోకేష్ పోటీ ..!

...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సిఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీకి లైన్ క్లియర్ అయింది. లోకేష్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం పై టిడిపి అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని హైకమాండ్ భావించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీచేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలి స్థానాన్ని టీడీపీ ఇంకా పెండింగ్ ఉంచింది.