logoసీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడనున్న ప్రియాంకా..!

...

అహ్మాదాబాద్‌లో ఉన్న శబర్మతి ఆశ్రమంలో ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంకానున్నది. అక్కడ కాంగ్రెస్ నేతలు ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన జవాన్లకు నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ నేషనల్ మ్యూజియంలో నేతలంతా భేటీకానున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వద్రా సీడబ్ల్యూసీ నేతలను ఉద్దేశించి మొదటిసారి మాట్లాడనున్నారు. గుజరాత్‌లో అక్రమ పద్ధతిలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.