logo



అవార్డు గొప్ప గౌరవంగా భావిస్తున్నా: మోహన్ లాల్..!

...

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మ భూషన్ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మోహన్ లాల్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు వ్యక్తిగతంగా, ఓ నటుడిగా ఇది గొప్ప అచీవ్ మెంట్. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41వ వసంతాలు పూర్తవుతున్నాయి. నా కోస్టార్లు, కుటుంబసభ్యులు, నా అందమైన సినీ ప్రయాణంలో నా వెంట ఉండి సహకారం అందించిన ప్రతీ ఒక్కరూ నా విజయంలో భాగస్వాములేనని మోహన్ లాల్ అన్నారు.