logo



వైసీపీలో చేరిన సినీనటి జయసుధ..!

...

ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరారు. నేడు ఆమె లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం జగన్ ఆమెకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ జగన్ సీఎం కావడం ఖయామన్నారు. ప్రస్తుతం తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. జగన్ సూచనలు మేరకు, పార్టీ విధానాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను  సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. సినీ ప్రముఖులు జగన్ ను కలవడంలో తప్పు ఏముందని అన్నారు.