logo



టిడిపి ఎంపి రామ్మోహన్‌ నాయుడు దీక్ష విరమణ..!

...

వాల్తేరు డివిజన్‌ ను విశాఖ రైల్వే జోన్‌లో కలపాలని డిమాండ్‌ చేస్తూ ఇచ్ఛాపురంలో టిడిపి ఎంపి రామ్మోహన్‌ నాయుడు చేపట్టిన దీక్షను ఈరోజు విరమించారు. వాల్తేరు డివిజన్‌ సాధన పేరిట ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో ప్రారంభించిన ఈ దీక్ష 15 గంటల పాటు కొనసాగింది. బెందాళం అశోక్‌, విద్యార్థినులు రామ్మోహన్‌ నాయుడికి నిమ్మరసాన్ని ఇచ్చి దీక్షను విరమింపచేశారు. రామ్మోహన్‌ నాయుడితో పాటు ఇచ్ఛాపురం ఎంఎల్‌ఎ అశోక్‌ కూడా దీక్షను విరమించారు.