logo



యుద్ధంతో రెండు దేశాలకు నష్టమే

...

యుద్ధం జరిగేతే ఇరుదేశాలకు నష్టం జరుగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందని ఆయన అన్నారు. ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందన్నారు. 40 మంది జవాన్లు బలికావడం బాధకారమని పవన్ చెప్పారు. మన పైలట్ పాకిస్థాన్ సైన్యానికి దొరకడం కలవరపాటుకు గురి చేస్తుందన్నారు.అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. జెనీవా నిబంధనలను పాకిస్థాన్ పాటించాలని కోరారు.