logo



సోనియాకు చుక్కెదురు

...

నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ దినపత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) గతంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను ఢిల్లీ హైకోర్టు వెనక్కి తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని తీర్పు చెప్పిందిఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో ఉన్న భవనం 56 ఏళ్ల లీజును రద్దు చేస్తూ.. భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా అక్టోబర్ 30నే పత్రిక ఓనర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనిని సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లింది.