logo



సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా సడన్ గా ఓ వృద్ధురాలు లేచి నిలబడి..!

...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తుండగా తిరుపతి యశోదానగర్ కు చెందిన పద్మావతి అనే వృద్ధురాలు లేచి ఏదో చెప్పాలని సభాస్థలి ముందుకురగా పోలీసులు అడ్డుకున్నారు. అది గమనించిన ముఖ్యమంత్రి ఆమెను ఆపొద్దు. నా కారు వద్దకు పంపండి అని సూచించారు. ప్రసంగం ముగిశాక పద్మావతమ్మ వద్దకు వచ్చి ఏంటమ్మ మీ సమస్య అని అడగ్గా నా కొడుకు మదన మణికాంత్ సివిల్ ఇంజినీరింగ్ ఉద్యోగం లేదు నేను అతని పైనే ఆధారపడ్డానని చెప్పడంతో తక్షణం స్పందించిన సీఎం అధికారులను పిలిచి ఆమె సమస్యను పరిష్కరించాలని చెప్పారు.