logo



కార్తీ - రష్మిక జంటగా కొత్త చిత్రం ..!

...

''ఖాకీ'' వంటి విభన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన యంగ్ హీరో కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. కార్తీ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ''గీత గోవిందం'' ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ''ఎన్ .జి.కే '' నిర్మిస్తున్న ఎస్.ఆర్.ప్రకాష్ బాబు ,ఎస్ .ఆర్ .ప్రభు' డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ''రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ''ఖాకీ'' చిత్రాన్ని 1995 నుంచి 2005 మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. రకుల్ ప్రీతీసింగ్ హీరోయిన్ గా    నటించింది.తెలుగు,తమిళ భాషల్లో విడుదలైన సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.