logoనన్ను చాలా మంది మోసం చేశారు ..!

...

నన్ను చాలా మంది మోసం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి గా ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే కొందరు అడ్డుపడ్డారని ఎర్రబెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ నాకు పెద్ద బాధ్యత అప్పజెప్పారని , నా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదన్నారు. అలాగే గ్రామ పంచాయతీలు అందంగా తీర్చిదిద్దాలని, కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో గ్రామీణ రూపురేఖలు మారుతాయనీ మంత్రి అన్నారు.