logo



రాహుల్ నియోజకవర్గానికి మోదీ వెళ్లడం లేదు ..!

...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో చేపట్టాల్సిన పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈరోజు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 27వ తేదీన అమేథిలో మోదీ పర్యటిస్తారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. అమేథిలో మున్షిగంజ్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు మోదీ వెళ్లనున్నట్లు అనేత చెప్పారు. ఆతర్వాత బహిరంగ సభలో మాట్లాడుతారన్నారు. అయితే మోదీ పర్యటన రద్దు అయినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆర్ ఏం మిశ్రా తెలిపారు.