logoహైదరబాద్ హౌజ్ లో ప్రిన్స్ సల్మాన్ తో మోదీ ..!

...

సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈరోజు ఢిల్లీలోని హైదరబాద్ హౌజ్ లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాల ముచ్చటించారు. ప్రిన్స్ సల్మాన్ నిన్న రాత్రి భారత్ కు వచ్చారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి మోదీ ఆయనకు స్వాగతం పలికారు. వాస్తవానికి ప్రిన్స్ సల్మాన్ రెండు రోజులు పాక్ లో పర్యటించారు. అక్కడ నుంచి నేరుగా భారత్ కు రావాల్సి ఉంది. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ నుంచి ఎవరూ నేరుగా భారత్ కు రాకూడదన్న నిబంధనను పాటించారు. దీంతో ప్రిన్స్ సల్మాన్ మళ్ళీ రియాద్ కు వెళ్ళి అక్కడ నుంచి భారత్ కు వచ్చారు. ప్రిన్స్ సల్మాన్ ను మోది తన నివాసానికి కూడా తీసుకువెళ్లారు. ఈ ఇద్దరూ కాసేపట్లో ఉగ్రవాద నిర్మూలనపై ఓ ప్రకటన చేయనున్నారు.