logo



దీవి శ్రీనివాస్ దీక్షితులు కన్నుమూత ..!

...

సినీ , రంగస్థల నటుడు దీవి శ్రీనివాస్ దీక్షితులు (62) మృతి చెందారు. ఆయన నిన్న హైదరబాద్ లోని నాచారం స్టూడియోలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా రూపొందిస్తున్న 'సిరిసిరిమువ్వలు' టీవి సీరియల్ లోని ఓ సన్నివేశంలో నటిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఆయన భార్య లక్ష్మీచిత్రలేఖ మూడేళ్ల క్రితం కన్నుమూశారు. కుమార్తె , కుమారుడు ఉన్నారు. అక్కినేని ఇనిస్టిట్యూబ్ ఆఫ్ మీడియా యాక్టింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు.