logo



నాని సినిమాలో కీలక పాత్ర చేస్తున్న'ఆర్ ఎక్స్ 100'హీరో ..!

...

హీరో నాని కొత్త చిత్రం నిన్ననే అధికారికంగా లాంచ్ అయింది. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. నటనలో తనకు స్ఫూర్తినిచ్చే నానితో నటించనుండటం అద్భుతంగా ఉందని అన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి రకరకాల ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నా అసలు కథ ఏమిటనేది గోప్యంగానే ఉంచారు టిమ్ .