logo



కాంగ్రెస్ చేరిన బీజేపీ మాజీ నేత ..!

...

మాజీ క్రికెటర్ , బీజీపీ మాజీ నేత కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆజాద్ కు పార్టీ కండువా పార్టీ కప్పి రాహుల్ ఆహ్వానించారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆజాద్ బిహార్ లోని దర్భంగా నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పై తీవ్ర విమర్శలు చేసినందున గతంలో బీజేపీ ఆజాద్ ను సస్పెండ్ చేసింది.