logo



నాని 24వ చిత్రం షురూ ..!

...

నేచురల్ స్టార్ నాని 24వ చిత్రం ప్రారంభమైంది. 'హలో' దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించబోయే చిత్రంలో నాని కథానాయకుడిగా నటించనున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. రేపటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవిన్ యెర్నేవి, రవి శంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమా ఫోటో గ్రాఫర్ గా వ్యవరించనున్నారు. మరోపక్క నాని 'జెర్సీ' సినిమాతో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాత్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు. ఇందులో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. 1990 దశకానికి చెందిన ఓ క్రికెటర్ జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.