logo



మేము పెళ్లి చేసుకోబోతున్నాం ..!

...

 

మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నమంటూ మరో ప్రేమ జంట అధికారికంగా ప్రకటన చేశారు. ఆర్య, సాయేషా ప్రేమ వ్యవహారంపై కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే అది నిజమేనంటూ ఆర్య అధికారికంగా ప్రకటించేశాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తామిద్దరం మార్చిలో ఒక్కటి కాబోతున్నమంటూ ఆర్య ఓ అందమైన కార్డు ద్వారా తెలిపాడు. మా తల్లిదండ్రులు, కుటుంబం, అలాగే మీ అందరి దీవెనలతో మేము మా జీవితంలో ఓ అందమైన రోజును షేర్ చేసుకోవలనుకుంటున్నాం. మేము మార్చి నెలలో వివాహం చేసుకోబోతున్నాం. మేమిద్దరం కొత్త ప్రయాణాన్ని సాగించేందుకు ఒక్కటవుతున్న సందర్భంగా మీ ప్రేమ, దీవెనలు కోరుకుంటున్నాం' అని ఆర్య ట్వీట్ చేశాడు.