logoనిన్ను త్వరగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నా బేబీ ..!

...

పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి మరోమారు తల్లి కాబోతుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా గర్భిణిగా ఉన్న ఫోటోకు '' నిన్ను త్వరగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నా బేబీ'' అంటూ క్యాప్షన్ పెట్టింది. టాలీవుడ్ లో '' నరసింహుడు'', అశోక్ , జై చిరంజీవ' తదితర చిత్రాల్లో సమీరారెడ్డి నటించింది. అక్షయ్ వాద్రాను 2014 లో పెళ్లాడింది. 2015 లో వీరికి సంతానం కలిగింది. జులైలో తాను మరో బిడ్డను కనబోతున్నానని తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.