logoపార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల ఆందోళన ..!

...

కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా తెదేపా ఎంపీలు, కేంద్రానికి వ్యతిరేకంగా నల్లని దుస్తుల్లో తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రాహుల్ తో పాటు సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆజాద్ ఇతర ఎంపీలు పాల్గొన్నారు.