logo



గ్రామీ వేడుకకు కూతురుతో కలిసి రెహ్మాన్ ..!

...

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఈరోజు ఈ యేటి గ్రామీ అవార్డులను ప్రదానం చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మస్ట్రో ఏ ఆర్ . రెహ్మాన్ ఆ వేడుకలో పాల్గొన్నారు. ఆయన తన కూతురు రహిమాతో కలిసి ఈవెంట్ కు వెళ్లారు. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి రెహ్మాన్ కు గ్రామీ అవార్డు కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఓ ఫోటోను ట్వీట్ చేశారు. లండన్ కు చెందిన ప్రశాంత్ మిస్ర్తీ, న్యూయార్క్ కు చెందిన ఫాల్గుణి షా,అమెరికాకు చెందిన సత్నం కౌర్ లు రెహ్మాన్ తో కలిసి ఫోటో దిగారు. లాస్ ఏంజిల్స్ లోని స్టేపుల్స్ సెంటర్ లో గ్రామీ అవార్డుల ప్రదానం సాగింది.