logo



దుర్గామతగా ప్రియాంక పోస్టర్లు ..!

...

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కాంగ్రెస్ పార్టీ యూపీ ఈస్ట్ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ పోస్టర్లు లక్నోలో స్వాగతమిస్తున్నాయి. ఎక్కడైనా, ఏదైనా పార్టీ నేత అంటే నగరం నిండా వారి పోస్టర్లు కనబడటం సహజం. కానీ యుపిలోని లక్నోకు ప్రియాంక వస్తున్న సందర్భంగా దుర్గమతా రూపంలో ఉన్న ప్రియాంక పోస్టర్లతో నగరాన్ని ముస్తాబు చేశారు. నాలుగు రోజుల పాటు యూపీలో పర్యటించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఆమె పలు చోట్ల ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు యూపీ వెస్ట్ ఇంఛార్జి జ్యోతిరాధిత్య సింధియా పాల్గొననున్నారు.