logo



ఏపీ చరిత్రలో మీపార్టీ అడ్రస్ గల్లంతవుంది ..!

...

సీఎం చంద్రబాబు ఈరోజు ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని, కేంద్రం భిక్ష కోసం కాదని ఆయన చెప్పారు. ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడిల్సిందే. పార్లమెంట్ సాక్షిగా ఏపికిచ్చిన హామీలు పరిష్కరించలేదు. దీనిపై నిలదీయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చలేదు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని అడిగారు. అలాంటిది ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారు. ఏపీ చరిత్రలో మీ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుంది అని చంద్రబాబు హెచ్చరించారు.