logo



చెన్నై లీలా ప్యాలెస్ లో ఘనంగా రజిని కూతురు పెళ్లి ..!

...

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రాజనీకాంత్ వివాహం ఈరోజు జరుగుతోంది. చెన్నైలోని ఎం ఆర్సీ నగర్ లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్ లో సౌందర్య పెళ్లి . తమిళ నటుడు విశాకన్ వనగమూడితో జరుగుతోంది. ఇప్పటికే రాజనీకాంత్, విశాకన్ కుటుంబీకులు మండపానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు ప్రారంభంకానుంది. వేడుకకు సౌందర్య ప్రముఖ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన చీరను ధరించారు. మండపానికి సినీ ప్రముఖులు కమల్ హాసన్, అనిరుధ్ రవిచందన్, ధనుష్ , ప్రభు, రాఘవ లారెన్స్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.