logoహీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత పెళ్లి ముహూర్తం ఫిక్సయింది

...

ప్రముఖ హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో మార్చి 1న జరగనుంది. హైదరాబాద్ లో జరిగే వీరి వివాహానికి తెలుగు సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వివాహ వేడుక అనంతరం, రామానాయుడు స్టూడియోస్ లో విందు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ నెల 6న ఆశ్రిత నిశ్చితార్థం జరిగింది. ఆశ్రితది ప్రేమ వివాహమని తెలుస్తోంది. పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో పెళ్లి పనుల్లో వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్టు సమాచారం. కూతురి వివాహ వేడుక పూర్తయ్యాక ావెంకీ మామ్ణ షూటింగ్ లో వెంకటేశ్ పాల్గొంటారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.