logo



చర్చనీయాంశంగా ఐశ్వర్య పోటోషూట్ ..!

...

బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నేట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో ఐశ్వర్య సరికొత్తగా కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య ఈ విధమైన లుక్ లో ఫోటోషూట్ కు దిగారు. 45 ఏళ్ల ఐశ్వర్య బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో జంప్ సూట్, స్టయిలీగ్ లాంగ్ బ్లేజర్ జాకెట్ ధరించారు. కర్లీ హెయిర్ ఆమెకు ప్రత్యేకతను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య ఫన్నెఖా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. అలాగే ఐశ్వర్య త్వరలో సుజయ్ ఘోష్, మణిరత్నం ల కొత్త ప్రాజెక్టులో పనిచేయనున్నారు. దీనితో పాటు ' కౌన్ థీ' రీమేక్ , అభిషేక్ తో మరో సినిమాలోనూ కనిపించనున్నారు.