logo



ఎన్టీఆర్ విలనే పైరసీ చేస్తున్నాడు..!

...

అందాల రాక్షసి చిత్రం తో హీరోగా ఇండస్ట్రీ కి పరిచమైన నవీన్ చంద్ర..ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం తో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో జగపతిబాబు కొడుకు గా ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించి ఫుల్ మార్కులు కొట్టేసాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రం గా నిలువడమే కాదు ఈ చిత్రంలో నటించినా నటి నటులకు మంచి పేరును తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీ లను పైరసీ అనే భూతం ఎంత ప్రమాదం గా మారిందో తెలియంది కాదు..ఇప్పుడు ఈ పైరసీ ని బేస్ చేసుకొని నవీన్ చంద్ర హీరో గా ఓ సినిమా చేయబోతున్నాడు. ఏ పైరేటెడ్ లవ్ స్టోరీ అనే సినిమాను అడ్డా దర్శకుడు జిఎస్ కార్తీక్ తెరకెక్కించబోతున్నాడట. పూజా ఝవేరి హీరోయిన్ గా నటించబోయే ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.నవీన్ కు హీరోగా సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.