logoబ్రహ్మి ని కలిసిన స్టైలిష్ స్టార్ ..!

...

హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు రీసెంట్ గా ముంబై లో హార్ట్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈయన్ను సినీ ప్రముఖులు పరామర్శిస్తూ వెళ్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ బ్రహ్మి ని పరామర్శించి ఆయనతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీని తాలూకా ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లుకొడుతుంది.ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందం..గత కొంతకాలం గా తన జోరును పూర్తిగా తగ్గించాడు. కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇవ్వడం , బ్రహ్మి కామెడీ హావ కూడా తగ్గడం తో దర్శక , నిర్మాతలు సైతం ఈయన్ను పక్కకు పెట్టారు. ఇప్పుడు హార్ట్‌ సర్జరీ కూడా జరగడం తో అవకాశాలు వస్తాయా..రావా అనేది ప్రశ్న గా మారింది. అభిమానులు మాత్రం తాను త్వరగా కోలుకొని మళ్లీ వెండితెర ఫై నవ్వులు పోయించాలని కోరుకుంటున్నారు. కొడుతుంది.