logo



మోదీ పిరికిపంద.. దమ్ముంటే చర్చకు రా .. రాహుల్ గాంధీ

...

 

 

ప్రధాని నరేంద్ర మోదీపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పిరికిపంద అని, దమ్ముంటే అతను ఓ 10 నిమిషాల పాటు తనతో చర్చించాలని రాహుల్ సవాల్ విసిరారు. ఏఐసీసీ మైనార్టీ సెల్ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనది 56 ఇంచుల ఛాతి అని మోదీ అన్నారని, తనతో ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ చేస్తున్నానని రాహుల్ అన్నారు. స్టేజ్ మీద ఆయన నాతో పది నిమిషాలు కూడా మాట్లాడలేడని, అతనోక పిరికిపంద అని రాహుల్ విమర్శించారు. ఏ ఎజెండా లేకుండానే మోదీ చైనాకు వెళ్లారని, డోక్లామ్ అంశంలో బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. మోదీ ఛాతి 4 ఇంచులే అని చైనా వాళ్లు నిరూపించారని రాహుల్ విమర్శించారు. కనీస ఆదాయం కల్పిస్తామని తమ పార్టీ హామీ ఇచ్చిందని, అంటే ప్రతి పేదకు నేరుగా లబ్ది చేకూరుతుందని అన్నారు.