logo



డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్

...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించాడు. అయితే దబాంగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా, ఏక్తా టైగర్‌లో స్పై పాత్ర పోషించిన సల్మాన్ మిగతా చిత్రాలలో అత్యంత ప్రీతిపాత్రమైన పాత్రలు పోషించాడు. ఈ సారి డిటెక్టివ్ అవతారంలో సల్మాన్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. వెటరన్ అనే సౌత్ కొరియన్ కాప్ థ్రిల్లర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ భావించగా, ఈ చిత్ర రీమేక్ రైట్స్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ సంస్థ దక్కించుకుందట. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో డిటెక్టివ్‌గా సరికొత్త లుక్‌లో సల్మాన్ అదరగొట్టనున్నాడట. వెటరన్ అనే కొరియన్ చిత్రం 2015లో విడుదల కాగా ,ఈ చిత్రం కొరియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ సాధించిన నాలుగో కొరియన్ సినిమాగా ఈ మూవీ రికార్డ్ సాధించింది. సల్మాన్ ప్రస్తుతం భారత్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈద్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.