logoతుఫాను దృష్ట్యా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం ..!

...

పెథాయ్ తుఫాను దూసుకువస్తున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను దృష్ట్యా ఏలూరు కలెక్టరేటేలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1077 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కాంటనేని భాస్కర్ పేర్కొన్నారు.