logoశ్రీదేవిని గుర్తు చేసుకున్న బిగ్ బి ..!

...

గత ఏడాది చనిపోయిన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవిని బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి తొలి వర్థంతి సమీపిస్తున్న తరుణంలో మరోసారి అమితాబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేశారు. శ్రీదేవితో తొలిసారి ఓ కన్సర్ట్ లో పాల్గొన్నట్లు అమితాబ్ చెప్పారు. లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన సంగీత కచేరీ కోసం శ్రీదేవితో పాటు బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా బిగ్ బితో వెళ్లారు. ఆ నలుగురు దిగిన ఫోటోను ఇప్పుడు బిగ్ బి షేర్ చేశారు. శ్రీదేవి, తను జూమ్మా చూమ్మా సాంగ్ కు డ్యాన్స్ చేసినట్లు బిగ్ బి చెప్పారు. సుమారు 70 ప్రేక్షకుల ముందు ఆ షో చేసినట్లు అమితాబ్ తన ట్యాగ్ లో వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ హోటల్ లో శ్రీదేవి బాత్ టబ్ లో పడి మృతిచెందిన విషయం తెలిసిందే.