logo



లాస్ ఏంజిల్స్ లో ఏం చేస్తున్నాడు ..!

...

ఎఫ్ -2 చిత్రంతో ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన హీరో వరుణ్ తేజ్ తాజాగా 'వాల్మీకి ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని తమిళ హిట్ సినిమా. జీగార్తండ్ర రీ- మేక్ గా తెలుగులో తీస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉన్న వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందుకోసం స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడట. వాల్మీకి ఫిల్మ్ లో ఇతని సరసన మృణాళిని రవి, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటించవచ్చునని అంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. తన బాక్సింగ్ శిక్షణ తాలూకు ఫోటోను వరుణ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.