logo

ఒంటి చేత్తో సూపర్ క్యాచ్ పట్టిన కోహ్లీ ..!

...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ పీటర్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ కళ్లు చెదిరే రీతిలో అందుకోవడం విశేషం. కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో దానిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే అలాంటిది మరో క్యాచ్ వచ్చిన అది అందనంత ఎత్తులో నుంచి బౌండరీకి వెళ్లిపోయింది. 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో టిమ్ పైన్ (15), పాట్ కమ్మిన్స్ (8) లు ఉన్నారు.