logo



హీరోయిన్ అకౌంట్ హ్యాక్ అయింది ..!

...

ఇటీవల నటి హన్సిక చరవాణిని హ్యాక్ చేసిన కొందరు ఆమె ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి నానా హంగామా చేశారు. ఇప్పుడు ఇదే ఇబ్బందిని మరొక హీరోయిన్ మేఘా ఆకాష్ ఎదుర్కొంది. అయితే ఈసారి ఆమె ఇన్ స్టాగ్రామ్ ను హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి కొన్ని అభ్యంతరకరమైన పోస్టింగ్స్ కూడా వేశారు. ఈ విషయాన్ని త్వరగానే గమనించిన మేఘా తన ఫోలోవర్లకు అకౌంట్ హ్యాక్ అయిందని, పోస్టింగులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఆమె బ్యాక్ ఎండ్ టిమ్ ఇప్పటికే అకౌంట్లో ఉన్న పోస్టింగ్స్ మొత్తాన్ని డిలీట్ చేయడం జరిగింది.