logo

రానాకు చెర్రీ విషెస్ ..!

...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. కలిసి చదువుకున్న వీరిద్దరూ అనంతరం సినిమాల్లోకి ప్రవేశించి తమకుంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదగగా, రానా స్టార్ యాక్టర్ గా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు రానా జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఫేస్ బుక్ ద్వారా తన స్నేహితుడు రానాకు చెర్రీ విషెస్ తెలియజేశాడు. నా రాక్ , నా హల్క్, నా భళ్లాలదేవ, నాకెంతో ఇష్టమైన వ్యక్తి అయిన రానాకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు విజయాలు చేకూరాలని , నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెర్రీ ఫేస్ బుక్ ద్వారా విషెస్ తెలియజేశాడు.