logoతారకరత్న రెస్టారెంట్ కూల్చివేత ..!

...

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సినీ హీరో తారకరత్నకు చెందిన ఫ్రెండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న రెస్టారెంట్ వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో కుల్చేందుకు వచ్చినట్లు అధికారులు తరకరత్నకు వివరణ ఇచ్చారు. అదే సమయంలో అధికారులతో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళల్లో మద్యం, సౌండ్స్ లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని సొసైటీ సభ్యులు జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే రెస్టారెంట్ కూల్చివేసేందుకు వచ్చామని అధికారులు తెలిపారు.