logo



పిల్లలని దత్తత తీసుకోవాలనుకుంటున్న అదితి ..!

...

అంతరిక్షం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అదితి రావు హైదరి సౌత్ లోని పలు భాషలలొ నటిస్తూ అలరిస్తుంది. తాజాగా సైకో అనే తమిళ చిత్రం చేస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో తాను పిల్లలంటే చాలా ఇష్టమని చెబుతూ ఏడు లేదా ఎనిమిది మంది పిల్లలని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. ఎప్పటి నుండో నాలో ఈ ఆలోచన ఉండగా, రెండేళ్ళలో నా ఆశ తప్పక నెరవేరుతుందని విద్య సాయం కూడా చేస్తానంటుంది. దత్తత అనేది మనుషులుగా మనం చేయగలిగిన గొప్ప పని అని అదితి రావు తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చెక్క చివంత వనం ( తెలుగులో నవాబ్ ) అనే తమిళ చిత్రం ఇటీవలి కాలంలో ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించింది.