logo



పౌరసత్వ బిల్లు తృణమూల్ మద్దతు కోరిన మోది ..!

...

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన థాకూర్ నగర్ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును ఆయన ప్రశంసించారు. ఆ బిల్లుకు రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాలని మోదీ కోరారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అయితే బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంట్ లో పాస్ అయ్యేలా చూడాలని మోదీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల తర్వాత యువత, రైతులు, ఇతర వర్గాలకు మరిన్ని వరాలు ఉంటాయన్నారు. మమతా బెనర్జీ పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని మోదీ అన్నారు.