logoనేటి నుండి పసుపు - కుంకుమ పెన్షన్లు ..!

...

ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో ఈరోజు , రేపు , సోమవారాలతో మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు కుంకుమ నగదు పంపిణీ చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్ లబ్థిదారులకు రూ. 150 కోట్ల నగదు అందజేయడానికి క్షేత్రస్థాయిలో అన్నీ ఏర్పాట్లు చేశారు. బ్యాంకర్లతో చర్చించి నగదు సిద్థం చేశారు. అబ్థిదారులకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ. 2వేలు నోటు ఒకటి, రూ. 500 నోట్లు రెండు ఇచ్చే విధంగా బ్యాంకార్లు నగదును ఎం పీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేశారు. గ్రామ, మండల, మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలో మూడు బృందాలు మూడు రోజుల పాటు వీటిని పంపిణీ చేస్తాయి.