logo



నాగార్జున సినిమాలో ఆర్ ఎక్స్ బ్యూటీ ..!

...

దేవదాస్ తరువాత నాగార్జున మరో సినిమా చేయలేదు. మొన్నటి వరకు నాగచైతన్య, అఖిల్ సినిమాల విషయాలపై దృష్టి పెట్టిన నాగ్, ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి సిద్థం అవుతున్నాడు. గతంలో నాగ్ హీరోగా మన్మధుడు వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్టైంది. నాగార్జునకు మన్మధుడు అనే ట్యాగ్ ను ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. ఇందులో హీరోయిన్ గా ఆర్ ఎక్స్ సినిమా బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారట. మరో హీరోయిన్ కు ఇందులో అవకాశం ఉంది. ఆర్ ఎక్స్ 100 తరువాత పాయల్ ఎన్టీఆర్ కథానాయకుడులో గెస్ట్ రోల్ చేసింది. రవితేజ సినిమాలో హీరోయిన్ గా బుక్ అయింది. ఇప్పుడు నాగార్జునతో చేస్తుండటం విశేషం .