logo'సైరా' మూడొంతులు పూర్తి, రిలీజ్ పై ..!

...

మెగాస్టార్ చిరంజీవి - నయనతార జంటగా రానున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిరంజీవి, రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేవలం మరో 50 రోజుల షూటింగ్ పార్ట్ మిగిలింది. దీన్ని ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని భావిస్తోంది యూనిట్. రాజస్థాన్ తోపాటు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కానుంది యూనిట్. అంతా అనుకున్నట్లు జరిగేతే దసరా రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. రేపోమాపో రిలీజ్ డేట్ ని ప్రకటించే ఆలోచనలో ఉంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. అమితాబ్, విజయ్ సేతుపతి వంటి నటుల కీలకపాత్ర పోషిస్తున్నారు.