logo



చిరు ను ఆకట్టుకున్న ఏంఎబీ సినిమాస్ ..!

...

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ఏంఎబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ ను హైదరబాద్ లో ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించడం జరిగింది. ఇప్పటికే చాలమందిని సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మల్టీప్లెక్స్ ను సందర్శించి ప్రశంసలు కురిపించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మల్టీప్లెక్స్ థియేటర్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. సైరా సినిమాతో బిజీబిజీగా ఉన్న చిరంజీవి తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి ఏం ఎబీ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఓ సినిమా చూశారు. అందమైన మల్టీప్లెక్స్ నిర్మాణం, మల్టీప్లెక్స్ లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఎంతో బాగున్నాయని కితాబిచ్చారు చిరంజీవి. మల్టీప్లెక్స్ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో చిరుకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ మల్టీప్లెక్స్ యజమాన్యానికి విషేష్ అందించారు.