logo



ఆటోవాలాగా మారిన ఏపీ మంత్రి ..!

...

రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు జీవిత కాలం పన్ను మినహాయించడంతో ఆటో డ్రైవర్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అభినందించారు. తామంతా జీవితాంతం సీఎం చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడులకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. నిన్న నిమ్మాడలో మంత్రిని ఆటో కార్మికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి అచ్చేన్నాయుడు ఆటో నడుపుతూ ర్యాలిగా టెక్కలి వరకు వచ్చి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు, వ్యవసాయ పనుల్లో వినియోగించే ట్రాక్టర్లకు సంబంధించి జీవిత కాలం పన్ను రద్దు చేసిందన్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.